ఈరోజు(జులై 7న) MS ధోని 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ధోని ఫ్యాన్స్ హైదరాబాద్‌లో 52 ఫీట్ల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఏపీలో సైతం 77 ఫీట్ల కటౌట్ ను ఏర్పాటు చేశారు.
తెలంగాణ వనపర్తి జిల్లా అమరచింత కస్తుర్భా విద్యాలయంలో కలుషిత ఆహారం తిని 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి సాంబార్, వంకాయ కూరతో భోజనం చేసిన వారికి అర్ధరాత్రి కడుపులో మంటతోపాటు వాంతులు అయ్యాయి. అయితే ఆ విద్యాలయలంలో ఒక్కరే టీచర్ ఉన్న క్రమంలో వారిని పట్టించుకోలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. ఉదయానికి వారి పరిస్థితి మరింత తీవ్రం కావడంతో వెంటనే పలువురి సాయంతో వారిని ఆత్మకూరు ...
ఓ బాలిక పట్ల అండగా ఉండాల్సిన రక్షకభటుడే(constable) కామంధుడిగా మారి కాటేశాడు. తన ఇంట్లో పనిలో చేరిన బాలికపై ఆరునెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. అంతేకాదు ఎవరికైనా చెబితే చంపేస్తానని కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు. అయినా కూడా ఆ అమ్మయి ధైర్యంగా పోలీసులకు చెప్పి అతన్ని అరెస్ట్ చేయించింది.
తెలుగు రాష్ట్రాలు ఎన్నికలకు ఇంకా 9 నెలల కంటే తక్కువ సమయం ఉన్నందున నెమ్మదిగా అన్ని పార్టీలు ఎన్నికల మూడ్‌లోకి ప్రవేశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన కొత్త పరిణామం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. టీఆర్‌ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti srinivas reddy) గురువారం సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(AP CM Jagan mohan red...
బీజేపీ పార్టీమీద ఎన్ని విషప్రచారాలు చేసిన ప్రజల మద్దతు బీజేపీకే ఉంటుందన్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. వరంగల్ కు ప్రధాని మోడీ వస్తున్న సందర్బంగా బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలుకాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
తెలంగాణకు మరో 8 మెడికల్ కళాశాలలు మంజూరయ్యాయి. దీంతో తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటు కానుంది. ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య కూడా మొత్తంగా 10 వేలకు చేరుకోనుంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి ఎంపికైన కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను పార్టీకి విధేయుడినని తెలిపారు. జులై 8న వరంగల్‌లో ప్రధాని మోదీ సమక్షంలో అధ్యక్ష బాధ్యతలను చేపడుతానని వెల్లడించారు.
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక విడాకుల కేసు సోషల్ మీడియా..వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా వైరల్ అవుతోంది. మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోబోతోందని చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది.