తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాల కిందకే వస్తాయని చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ గ్రామాలు రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ పరిధిలోకి వస్తాయని పేర్కొంది. దీంతో ఆదివాసీయేతరుల అప్పీల్ ను హైకోర్టు కొట్టివేసింది. సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం చేసుకోలేమన్న కోర్టు..ఈ మేరకు తీర్పు వెలువరించింది.
తెలంగాణలో గ్రూప్4 ఫలితాలు మరికొన్ని రోజుల్లో రానున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే రిలీజ్ చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.
నటుడు నాగబాబు కూతురు నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడిపోనుంది. మనస్పర్దల వల్ల గత కొన్ని రోజులుగా వీరు విడిగా ఉంటున్నారు. అప్పటి నుంచి వీరిపై బ్రేకప్ రూమర్స్ ఎక్కువయ్యాయి. అయితే విడాకులు కోరుతూ నిహారిక దరఖాస్తు చేసుకోవడంతో ఈ విషయంపై అందరికీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి సోము వీర్రాజు(Somu Veerraju)ను తీసేశారు. పార్టీ అధ్యక్షుడి పదవి నుంచి తనను తొలగిస్తున్నట్లు సోము వీర్రాజుకు జేపీ నడ్డా(jp nadda) ఫోన్ చేసి చెప్పారు. అయినప్పటికీ పార్టీలో ప్రత్యేక అవకాశం కల్పిస్తామని నడ్డా తెలిపారు. సాయంత్రం కొత్త అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి(kishan reddy) నియామాకం. త్వరలో బండి సంజయ్(bandi sa...
ఓ వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి ఆకస్మాత్తుగా స్పృహ కోల్పోయి కింద పడ్డాడు. ఆ క్రమంలో ఆ వ్యక్తిని వైన్ షాపు సిబ్బంది పట్టించుకోకుండా రోడ్డు పక్కన పడేశారు. దీంతో అతను అస్వస్థతకు గురై మృత్యువాత చెందాడు. ఇది తెలిసిన అతని భార్య అక్కడకు వచ్చి కోపంతో వైన్ షాపులోని సీసాలను పగులగొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
హైదరాబాద్ పరిధిలో ఓ కారు నానా బీభత్సం సృష్టించింది. ఉదయం మార్నింగ్ వాకింగ్ కోసం వెళుతున్న నలుగురిని బండ్లగూడ జారీర్ సన్ సిటీ వద్ద ఢీ కొట్టింది. దీంతో ఈ ఘటనలో తల్లి, కుమార్తె మరణించారు. మరో ఇద్దరు మహిళలకు గాయాలు అయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. మృతులు అనురాధ(38), మమత(26)గా గుర్తించారు. అయితే అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబం...
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(droupadi murmu) మంగళవారం హైదరాబాద్లో(hyderabad) ఒకరోజు పర్యటన చేయనున్నారు. రాష్ట్రపతి ఉదయం ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు చేరుకుని బొలారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లనున్నారు.
తెలంగాణ(telangana)లో టీఎస్ ఎన్నికల సీజన్ వచ్చేసింది. ఎన్నికల వాగ్దానాలు, బహిరంగ సభలు నిర్వహించేందుకు అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. అయితే బీఆర్‌ఎస్, బీజేపీల కంటే కాంగ్రెస్ ఒక అడుగు ముందుంది. ఈ క్రమంలో మేనిఫెస్టో రిలీజ్ డేట్ ను కూడా ఖారారు చేసింది.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో యువనేత రఘున్నకు మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు భారీ కార్, బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత పెద్దఎత్తున పాల్గొన్నారు.