హైదరాబాద్ మెట్రో రైలు(Hyderabad Metro train) మరో రికార్డు క్రియేట్(created a new record) చేసింది. జులై 3న సోమవారం మెట్రో రైలులో 5 లక్షల 10 వేలమంది ప్రయాణం చేశారు. ఆ ఒక్కరోజే ఇంత భారీస్థాయిలో ప్రయాణికులు ట్రావెల్ చేయడంతో రికార్డు నమోదైంది. నాగోల్ నుండి హైటెక్ సిటీ, ఎల్బీ నగర్ నుండి కూకట్పల్లి రూట్లలో ఎక్కువమంది ప్రయాణించినట్లు మెట్రో రైలు నిర్వాహకులు తెలిపారు. ఇప్పటి వరకూ కూాడా హైదరాబాద్ మెట్రో రైలు 40 కోట్లమంది ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలకు చేర్చింది.
2017 నవంబర్ 29వ తేదిన హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు(Hyderabad Metro train) వ్యవస్థ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆఫీసు వేళల్లో మెట్రోలో జనం రద్దీగా ఉండటంతో అమీర్పేట జంక్షన్ వద్ద ఉదయం, సాయంత్రం వేళల్లో జనం కిక్కిరిసిపోతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని రూట్లలో ఈ మెట్రో సేవలు(Metro services) అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.