NLG: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్న నాయకులతో సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఊపందుకున్న నేపథ్యంలో రిజర్వేషన్ ఖరారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రక్రియపై మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం హామీలను నెరవేరుస్తూ, అభివృద్ధి పనులు చేస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
NGKL: 2025-26 సంవత్సరానికి గాను జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపుకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఈరోజు నోటిఫికేషన్ జారీ చేశారు. జిల్లాలో మొత్తం 67 మద్యం దుకాణాలకు రేపటి నుంచి అక్టోబర్ 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. అక్టోబర్ 23న లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయిస్తామని తెలిపారు. రూ.3 లక్షలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
MLG: వాజేడు మండలంలోని బొగత జలపాతం గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద రావడంతో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. అటవీ శాఖ అధికారులు స్విమ్మింగ్ పూల్లోకి దిగడానికి అనుమతి నిరాకరించారు. పర్యాటకులు జలపాతాన్ని సందర్శించవచ్చు కానీ నీళ్లలోకి దిగడానికి అనుమతి లేదని ఇవాళ స్పష్టం చేశారు.
మేడ్చల్: KPHB సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. వరుసగా సెలవులు రావడం, పండుగ వేళ అనేక మంది పట్టణ ప్రజలు పండగ కోసం షాపింగ్ చేసేందుకు వెళుతుండగా, షాపింగ్ మాల్స్ వద్ద వాహనాల సంఖ్య పెరుగుతుంది. దీంతో రోడ్ల పై పరిచోట్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది.
ASF: సిర్పూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప, జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ కోనేరు కృష్ణారావులు గురువారం BRS పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
JGL: దసరా ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని పురాతన దేవాలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు గురువారం చేపట్టారు. ఈ వేడుకల్లో భాగంగా స్వామివారు “హంస” వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కాగా శ్రీనివాసున్ని రథంపై అందంగా అలంకరించి పట్టణంలోని పుర వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు.
NLG: మునుగోడులో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె పాఠశాల నిర్మాణ స్థలాన్ని సందర్శించారు. పనులు ఇంకా ప్రారంభం కాకపోవడంపై అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, వెంటనే పనులు మొదలుపెట్టాలని సూచించారు.
ADB: జిల్లాలోని అన్ని పాఠశాలలో మౌళిక వసతులు కల్పించేందుకు టాయిలెట్స్, విద్యుత్, మంజూరైన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. EGSలో మంజూరైన పనులను వేగవంతం చేయాలని, పనులు పెండింగ్‌లో ఉంచకుండా, నాణ్యత ప్రమాణాలు పాటించి పూర్తి చేయాలని MEOలను ఆదేశించారు. త్రాగు నీరు, మెజర్, మైనర్ పనులను పెండింగ్ వర్క్స్‌పై దృష్టి సారించాలని సూచించారు.
SRD: కంగ్టి మండలం బోర్గి UPS లో గతేడాది వరకు ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆంజనేయులు గ్రూప్-1 ఫలితాల్లో సత్తా చాటారు. ఈ మేరకు MPDOగా సెలెక్ట్ అయ్యారు. 2008 DSCలో టీచరుగా నియమితులై బోర్గిలో చాలా కాలం పాటు నిధులు నిర్వహించారు. గత 2024లో హవేలీ ఘనపూర్ హాస్టల్ వార్డెన్‌గా బదిలీపై వెళ్లారు. అయితే MPDOగా నియామకమవడంతో బోర్గి గ్రామస్తులు ఇవాళ అభినందించారు.
NRPT: మక్తల్ మండల కేంద్రంలోనీ హైవే నుంచి మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్లే చౌరస్తా పేరు ఇంతకు ముందు భగత్ సింగ్ చౌరస్తాగా ఉండేది. ప్రస్తుతం దాన్ని పెరియార్ చౌరస్తాగా మార్చడం సరికాదని మక్తల్ ధార్మిక సంఘం నాయకులు ఇవాళ స్థానిక ఎంపీ డీకే అరుణకు వినతిపత్రం అందించారు. దీనిపై తగిన చర్యలు తీసుకుని చౌరస్తాకు భగత్ సింగ్ పేరుని పెట్టాలని వారు కోరారు.
MDK: విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ ప్రతి గ్రామం తప్పకుండా సందర్శించే నేరని నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు పేర్కొన్నారు. హవేలి ఘనపూర్ పోలీస్ స్టేషన్‌లో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. పోలీస్ స్టేషన్ రికార్డులు, కేసుల నమోదు స్థితి, పెండింగ్ కేసుల పురోగతి, సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు.
వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రధాన గేట్ ఎదుట అఖిల భారత రైతు సమాఖ్య ఏఐకెఎఫ్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేశ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు వెంటనే రైతు లకు ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేశారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ సత్య శారదాదేవికి వినతిపత్రాన్ని అందజేశారు.
MDK: మెదక్ జిల్లాలో 49 మద్యం షాపుల నిర్వహణకు ఎస్సీ, ఎస్టీ, బీసీ గౌడ కులస్తుల రిజర్వేషన్ ఎంపిక కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ డ్రా నిర్వహించారు. జిల్లాలో బీసీ గౌడ సామాజిక వర్గానికి 9, ఎస్సీ సామాజిక వర్గానికి 6, ఎస్టీ సామాజిక వర్గానికి ఒకటి లాటరీ ద్వారా ఎంపిక చేసినట్లు వివరించారు. 33 ఓపెన్ కేటగిరిలో ఉంచిన్నట్లు తెలిపారు.
MBNR: ఏబీవీపీ పాలమూరు యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో NCC ప్రారంభించాలని యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరేష్ తేజ మాట్లాడుతూ.. యూనివర్సిటీలో ఉన్న UG కోర్సులో ఎక్కువ విద్యార్థులు చదువుతున్నారు. యునివర్సిటీ ప్రారంభం అయినప్పటి నుంచి నేటి వరకు NCC లేకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారు. ఈ కర్యక్రమంలో ఏబీవీపీ నేతలు పాల్గొన్నారు.
KNR: తిమ్మాపూర్ మండలం మోడల్ స్కూల్ విద్యార్థులలో నైపుణ్యాలను పెంచే లక్ష్యంతో తిమ్మాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థులకు బ్యూటీ అండ్ వెల్నెస్ ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణను కరీంనగర్‌లోని యూనిక్ బ్యూటీ పార్లర్‌లో ప్రారంభించినట్లు ప్రధానోపాధ్యాయురాలు వనజ తెలిపారు.