»Mla Daughter Filed A Case Aganist To Muthireddy Yadagiri Reddy
Jangaon చిక్కుల్లో జనగామ ఎమ్మెల్యే.. సొంత కూతురే కేసు పెట్టించిన వైనం
ఈ భూమి విషయంలో తన తండ్రి ఫోర్జరీకి పాల్పడ్డాడని సోమవారం ఆరోపించారు. చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నా సంతకాలను ఫోర్జరీ చేసి భూమిని తన పేరుపై ఎమ్మెల్యే మార్చుకున్నారని ఆమె ఆరోపిస్తున్న మాట.
అధికారంలో ఉన్న వారిపై సాధారణంగా ప్రజల (People) నుంచి ఆరోపణలు రావడం సహజం. కానీ సొంత కుటుంబసభ్యులే ఫిర్యాదులు, విమర్శలు చేయడం చాలా అరుదు. తాజాగా బీఆర్ఎస్ (BRS Party) జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరి రెడ్డిపై (Muthireddy Yadagiri Reddy) సొంత కుమార్తె పోలీసులను ఆశ్రయించింది. భూమి విషయంలో తన సంతకాన్ని తండ్రి ఫోర్జరీ (Forgery) చేశారని ఆమె ఆరోపిస్తున్న మాట. సొంత తండ్రిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లాలో ఆసక్తికరంగా మారింది.
జనగామ (Jangaon) ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి కుమార్తె తుల్జా భవానీ రెడ్డి. సిద్దిపేట జిల్లా (Siddipet District) చేర్యాలలో ఎకరం 20 గుంటల భూమిపై వివాదం ఏర్పడింది. ఈ భూమి విషయంలో తన తండ్రి ఫోర్జరీకి పాల్పడ్డాడని సోమవారం ఆరోపించారు. చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నా సంతకాలను ఫోర్జరీ చేసి భూమిని తన పేరుపై ఎమ్మెల్యే మార్చుకున్నారని తుల్జా భవానీ ఆరోపిస్తున్న మాట. అయితే ఈ సంఘటనపై ఇప్పటివరకు కేసు నమోదు కాలేదు. గతంలోనూ యాదిగిరి రెడ్డిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
కాగా, జనగామ ఎమ్మెల్యే యాదిగిరి రెడ్డిపై గతంలోనూ చాలా భూకబ్జా (Land Occupation) ఆరోపణలు వచ్చాయి. ఇన్నాళ్లు ప్రజలు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు సొంత కూతురే ఫిర్యాదు చేయడంతో అతడి కబ్జాలు వాస్తవమేనని తేలింది. చెరువు ఆనుకుని ఉన్న స్థలాన్ని కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం సొంత కూతురే ఫిర్యాదు చేయడంతో జనగామ ఎమ్మెల్యే ఎలాంటి వ్యక్తో అర్థమవుతోంది.