»Khelo Telangana Aims To Instill Sports Spirit In The Youth Kishan Reddy
Sports Festival : యువతలో క్రీడా స్ఫూర్తి నింపడమే లక్ష్యంగా ఖేలో తెలంగాణ : కిషన్ రెడ్డి
యువతలో క్రీడా స్ఫూర్తి నింపడమే లక్ష్యంగా వారిని అంతర్జాతీయ క్రీడాపోటీల్లో సత్తాచాటేలో తీర్చిదిద్ధడమే ధ్యేయంగా.. ప్రధాని మోదీ పిలుపుతో నిజాం కాలేజీ (Nizam College) గ్రౌండ్ లో “ఖేలో తెలంగాణ జీతో తెలంగాణ” స్పోర్ట్స్ ఫెస్టివల్ (Sports Festival)నిర్వహించారు.
యువతలో క్రీడా స్ఫూర్తి నింపడమే లక్ష్యంగా వారిని అంతర్జాతీయ క్రీడాపోటీల్లో సత్తాచాటేలో తీర్చిదిద్ధడమే ధ్యేయంగా.. ప్రధాని మోదీ పిలుపుతో నిజాం కాలేజీ (Nizam College) గ్రౌండ్ లో “ఖేలో తెలంగాణ జీతో తెలంగాణ” స్పోర్ట్స్ ఫెస్టివల్ (Sports Festival) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kisanreddy) , బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్ లక్ష్మణ్, పుల్లెల గోపీ చంద్(Pullela Gopi Chand) జేజే శోభ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ నాయకులకు కూడా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉండాలన్నారు. అది లేకుండా పోయిందని, రాజకీయ నేతలకు కూడా క్రీడలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. దేశం ప్రపంచంలో అన్ని రంగాల్లో దూసుకు పోతుందని, ఐటీ, బహుళ జాతి సంస్థలకు సారథ్యం వహిస్తున్నారని ఆయన అన్నారు.
అంతేకాకుండా…క్రీడ రంగంలో మాత్రం వెనుకబడి ఉన్నామని, క్రీడలను ప్రోత్సహించడానికి ప్రధాని ప్రత్యేక శ్రద్ద పెట్టారని ఆయన వెల్లడించారు. క్రీడాకారులను వెలికి తీసుకు రావడానికే ఈ ఖేలో తెలంగాణ (Khelo Telangana) కార్యక్రమం అని ఆయన వివరించారు. ఇందులో గెలుపొందిన వారికి బహుమతులుతో పాటు, నగదు పారితోషికం ఉంటుందని ఆయన వెల్లడించారు. అనంతరం ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. తమ పిల్లల చదువుకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో క్రీడలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు. క్రీడ రంగంలో రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయని, రాజకీయ నేతల్లో క్రీడ స్ఫూర్తి లేదని ఆయన అన్నారు. అందుకే క్రీడల్లో రాజకీయ నాయకులను భాగస్వామ్యం ప్రధాని చేస్తున్నారని ఆయన వెల్లడించారు. క్రీడ ప్రాంగణాలు పెరగాలని, హైదరాబాద్లో ఉన్న ప్లే గ్రౌండ్ లను కాపాడుకోవాల్సిన బాధ్యత మన పై ఉందని ఆయన తెలిపారు. మద్యం సెంటర్ లు కాదు స్పోర్ట్స్ సెంటర్ లు కావాలని, బెల్ట్ షాప్ లు మూత పడాలని ఆయన లక్ష్మణ్ అన్నారు. ప్రతి జిల్లాలో స్పోర్ట్స్ సెంటర్ (Sports Center )ఏర్పాటుకు నిధులు కేంద్రం ఇవ్వనుందని ఆయన వెల్లడించారు. యువతలో క్రీడా స్ఫూర్తి నింపేందుకు మూడు రోజలు పాటు ఆటల పోటీలు నిర్వహించనున్నారు. ఖేలో సికింద్రాబాద్, జీతో సికింద్రాబాద్ అంటూ సత్తాచాటేందుకు రెడీ అయ్యారు.
సికింద్రాబాద్ (Secunderabad) యువత. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో సాగే పోటీల్లో 578 టీమ్ లు సత్తాచాటేందుకు సిద్ధమయ్యాయి. స్త్రీ, పురుషుల విభాగాల్లో కబడ్డీ, క్రికెట్, ఖోఖో, వాలీబాల్, రన్నింగ్ విభాగాల్లో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు పోటీలు జరగనున్నాయి. క్రీడలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ (Budget) లో ప్రత్యేక నిధులు కేటాయించిందన్నారు. మన దేశ జనాభాకు తగ్గట్టు క్రీడాకారులు లేరని అందుకే మోదీ సర్కార్ యువతలో క్రీడా స్ఫూర్తి నింపేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఫిబ్రవరి 10న ముగిసిన రిజిస్ట్రేషన్లు సికింద్రాబాద్ క్రీడోత్సవాలకు ఫిబ్రవరి (February) 10 వరకు ఉచిత రిజిస్ట్రేషన్లు జరిగాయి. సికింద్రాబాద్ (Secunderabad) పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చాలా మంది యువత క్రీడోత్సవాల్లో పాల్గొనేందుకు పోటీపడ్డారు. మొదట సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ స్థానాల్లో పోటీలు నిర్వహించి.. దానిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారిని.. పార్లమెంట్ (Parliament)స్థాయిలో పోటీలకు సెలెక్ట్ చేయనున్నారు. ఇలా అన్ని నియోజకవర్గాల్లో మొత్తం 578 టీమ్ లు పోటీ పడుతున్నాయి.