అసెంబ్లీ గన్ పార్క్ వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హల్ చల్ చేశారు. అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్లనివ్వరా…మొన్న సెక్రటరీయెట్ వేళ్తే అడ్డుకున్నారంటూ నిరసనకు దిగారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ గుండాయిజం ఎంటి అని ప్రశ్నించారు. అంబేడ్కర్ సెక్రటేరియట్‌ని కేసీఆర్ పుట్టినరోజు ఓపెన్ చేయడం ఎంటి..? వాస్తు బాగాలేదని సెక్రటేరియట్ కులగొట్టడం ఎంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను వద్దన్నాను, దేవుడు వద్దు అనుకున్నాడు. అందుకే సెక్రటేరియట్ కాలిపోయింది. నాతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది. దేవుడు కూడా కేసీఆర్ కి వ్యతిరేకంగా ఉన్నాడు. దేవుడికి నచ్చకనే సెక్రటరీయెట్ కి వ్యతిరేకంగా నిలబడ్డాడు. అవినీతి ఎంతో కాలం చెల్లదంటూ విమర్శించారు. కేసీఆర్ ఇప్పటికైనా పశ్చాత్తాపడాలి.. మారాలంటూ సూచించారు. కేసీఆర్ ఈసారి ముఖ్యమంత్రిగానే గెలవలేడు.. ప్రధాని ఏం అవుతాడా అంటూ ఎద్దేవ చేశారు.అంబేడ్కర్ జయంతి రోజే సెక్రటేరియట్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నూతన సచివాలయం కేసీఆర్ పుట్టినరోజు ప్రారభించడాన్ని సవాలు చేస్తూ కెఏ పాల్ హైకోర్టులో పిల్ వేశారు. ఏప్రిల్ 14 న అంబేద్కర్ పుట్టినరోజు నాడు నూతన సచివాలయం ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.