Traffic Jam: ట్రాఫిక్ చక్రబంధంలో హైదరాబాద్ వాసులు, 9 నుంచి రాత్రి 10 వరకు కష్టాలే
హైదరాబాద్‌లో ట్రాఫిక్ చిక్కులు తప్పడం లేదు. ఉదయం 9 అయ్యిందంటే చాలు రోడ్డు మీదకు రావాలంటే జంకే పరిస్థితి. అరగంటలో వెళ్లాల్సిన చోటకి.. గంట సమయం పడుతుంది. ట్రాఫిక్ సమస్య తీర్చాలని పాలకులను సిటీ వాసులు కోరుతున్నారు.
Traffic Jam: విశ్వనగరి హైదరాబాద్‌లో ట్రాఫిక్ చిక్కులు అన్నీ ఇన్నీ కావు. కొంచెం దూరం ప్రయాణించాలని అనుకున్న ట్రాఫిక్ చక్రబంధంలో ఇరుక్కొవాల్సిందే. దానికి తోడు వన్ వే, యూ టర్న్ పేరుతో వాహనదారులు ఇబ్బందికి గురవుతున్నారు. సైబరాబాద్‌లో హైటెక్ సిటీ, మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో సరైన సైన్ బోర్డ్స్ ఉండవు. దీంతో యూ టర్న్ తీసుకునే సమయంలో కొత్త వారికి చిక్కులు తప్పవు. మిగతా చోట్ల కూడా ఆధునికీకరణ పేరుతో యూ టర్న్స్ దూరంగా పెట్టారు. దీంతో వాహనదారులు అనవసరంగా కిలోమీటర్ వరకు తిరగాల్సి వస్తోంది. స్కూల్స్, కాలేజీలు స్టార్ట్ అయ్యాయి. పిల్లలు బడి బాట పడుతున్నారు. దాదాపు అన్నీ స్కూల్స్ ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు స్టార్ట్ అవుతుంటాయి. ఆ సమయంలో పిల్లలను దింపి రావడానికి పేరంట్స్ యుద్ధమే చేయాల్సి వస్తోంది. పిల్లలను విత్ లంచ్ బాక్స్‌తో సహా ఇచ్చి వచ్చి.. హమ్మయ్యా అని రిలాక్స్ అయ్యే పరిస్థితి. లంచ్ బాక్స్ ఇవ్వని వారు.. స్నాక్స్ కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక సాయంత్రం 3.30 గంటల నుంచి రద్దీ ఉంటుంది. స్కూల్స్ వద్ద పిల్లలు.. ఇతర వాహనాలతో ర్యాష్‌గా ఉంటుంది. ఏ ఒక్క వాహనం అటు ఇటు అయినా.. అక్కడ ట్రాఫిక్ జామ్ కావాల్సిందే.
ట్రాఫిక్ చక్రబంధం
కాలేజీకి వెళ్లే యువత, ఆఫీసుకు వెళ్లే ఉద్యోగులు ఉదయం 9.30 గంటల నుంచి రోడ్డు మీదకి వస్తుంటారు. దాదాపు మెజార్టీ పీపుల్ బైక్స్ వాడుతుంటారు. కొందరు బస్, లేదంటే ర్యాపిడో యూజ్ చేస్తుంటారు. అంతా ఓకేసారి రోడ్డు మీదకి రావడంతో ట్రాఫిక్ ఎక్కడిక్కకడే జామ్ అవుతుంది. దీనికితోడు కొన్ని సందర్భాల్లో ధర్నాలు, ఆందోళనలకు విద్యార్థి సంఘాలు పిలుపునిస్తుంటాయి. దీంతో రోడ్డు మీద వాహనాలు నిలిచే పరిస్థితి ఉంటుంది. అలా ఆఫీసుకు వెళ్లే ఉద్యోగులకు లేట్ అవుతుంది. చివరికీ బాస్ చేత తిట్లు తినాల్సి వస్తోంది. ఆ చక్రవ్యుహాం నుంచి ఎలాగోలా కార్యాలయానికి చేరుకుని.. హామ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటారు. ఉదయం 10, 11 గంటలు అయినా సరే రోడ్డు మీద వాహనాల రద్దీ మాత్రం తగ్గదు. మధ్యాహ్నాం 12 గంటల నుంచి 2.30 గంటల వరకు కాస్త రద్దీ తగ్గినట్టు అనిపిస్తోంది. ఈ సమయంలో నిర్ణీత ప్రదేశానికి అనుకున్న సమయంలో వెళ్లగళుతారు. మధ్యాహ్నం 3 గంటలు అయ్యిందంటే చాలు.. మళ్లీ జనం రోడ్ల బాట పడుతున్నారు. ఈ సమయంలో స్కూల్ పిల్లలు, యువత, ఉద్యోగులు కాక.. వ్యాపారులు, ఇతర అవసరాలు ఉన్న జనం, మహిళలు.. ఊర్ల నుంచి వచ్చినవారితో రోడ్లు నిండిపోతున్నాయి. ఇక మధ్యాహ్నాం 3.30 దాటితే చాలు సిటీ రోడ్లపై జనం ఫ్లోటింగ్ పెరుగుతుంది. అదీ రాత్రి వరకు కొనసాగుతుంది. రాత్రి 9.30 నుంచి 10, 10.30 తర్వాత రోడ్లు కాస్త పలుచబడతాయి.
రద్దీగా రోడ్లు
సాయంత్రం 5 గంటల నుంచి అయితే బయటకు వెళ్లకపోవడమే ఉత్తమం. అప్పుడు స్కూల్ నుంచి వచ్చే పిల్లలు, కాలేజీ స్టూడెంట్స్, ఆఫీసుల నుంచి వచ్చేవారు, మార్కెట్ కోసం బయటకు వచ్చిన మహిళలు.. అందరితో రోడ్లు నిండిపోతాయి. ఈ సమయంలో ట్రాఫిక్ కంట్రోల్ చేయడం ట్రాఫిక్ పోలీసులకు కత్తిమీద సాములా మారుతుంది. సాయంత్రం పూట సీఎం కాన్వాయ్ వచ్చిందంటే చాలు.. ట్రాఫిక్ పోలీసులకు చుక్కలే.. అప్పుడే రోడ్ల మీదకు వస్తోన్న జనాన్ని కంట్రోల్ చేయడం అంటే మాములు మాటలు లేదు. ఏ వైపు నుంచి బయల్దేరిన సరే కనీసం 15 నిమిషాలు ఆపుతారు. కొందరు మంత్రులు, అప్పుడప్పుడు రాష్ట్రపతి, ప్రధాని, ఉప రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చిన సందర్భాల్లో ట్రాఫిక్ ఆంక్షలు మాములుగా ఉండవు. శ్రీరామ నవమి శోభాయాత్ర, బోనాలు, వినాయక చవితి.. ఇతర ముఖ్యమైన పండగ సమయాల్లో ట్రాఫిక్ మళ్లిస్తారు. మీడియాకు సమాచారం ఇచ్చి.. ఆ రూట్లలో రావొద్దని సూచిస్తారు. ఇక వర్షకాలంలో రాత్రి పూట కూడా రోడ్డుపై జనాలు ఉంటారు. ఇంటికి, బయటకు వెళ్లేందుకు బయటకు రాగా.. డివైడర్ లేని చోట ట్రాఫిక్ ఆగిపోతుంది. ఆ సమయంలో ట్రాఫిక్ పోలీసులు ఉంటే క్లియర్ చేస్తారు. లేదంటే ఎవరో ఒకరు ఇనిషియేటివ్ చేసుకొని క్లియర్ చేయాల్సి ఉంటుంది. లేదంటే వర్షంలో రోడ్డుపై వెయిట్ చేయక తప్పని పరిస్థితి నెలకొంది.
నో యూజ్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య నివారణ కోసం వన్ వే చేశారు. కొన్ని చోట్ల యూ టర్న్‌లు పెట్టారు. మరికొన్ని చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జీ నిర్మించి.. పాదచారుల నుంచి ఇబ్బంది లేకుండా చూశారు. ఉప్పల్‌లో స్కై వే నిర్మించారు. మరికొన్ని చోట్ల కూడా నిర్మించాల్సి ఉంది. బస్సులతోపాటు లోకల్ ట్రైన్స్ ఉన్నాయి. మెట్రో వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. మెట్రో సేవలను ఐటీ, ఇతర రంగాలకు చెందిన వారు ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ ట్రాఫిక్ రద్దీ తగ్గలేదు. కూకట్ పల్లి, మైత్రీవనం, అమీర్ పేట, దిల్ సుఖ్ నగర్, జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ప్యాట్నీ, టెలిఫోన్ భవన్ తదితర చోట్ల ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. సిటీలో ట్రాఫిక్ సమస్యను నివారించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఎలా అని కొందరు భయపడుతున్నారు.