»High Court Angry On Government Pleader On Revanth Reddy Protection
Revanthకు భద్రత ఇస్తే పిటిషన్ ఎందుకొచ్చింది? జీపీకి ధర్మాసనం ప్రశ్న
Revanth reddy:పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) హాత్ సే హాత్ జోడో పాదయాత్ర కొనసాగుతోంది. జనం నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే పాదయాత్రలో తనకు భద్రత పెంచాలని రేవంత్ (Revanth reddy) అంటున్నారు. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రేవంత్ (Revanth reddy) తరఫు న్యాయవాది, ప్రభుత్వం తరఫు లాయర్ (జీపీ) వాదనలు వినిపించారు.
High court angry on government pleader on revanth reddy protection
Revanth reddy:పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) హాత్ సే హాత్ జోడో పాదయాత్ర కొనసాగుతోంది. జనం నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే పాదయాత్రలో తనకు భద్రత పెంచాలని రేవంత్ (Revanth reddy) అంటున్నారు. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రేవంత్ (Revanth reddy) తరఫు న్యాయవాది, ప్రభుత్వం తరఫు లాయర్ (జీపీ) వాదనలు వినిపించారు.
రేవంత్ (Revanth reddy) పాదయాత్రకు సర్కార్ భద్రతను కల్పిస్తోందని ప్రభుత్వం తరఫు న్యాయవాది (జీపీ) తెలిపారు. ఇప్పటికే డీజీపీ ఎస్పీలకు ఆదేశాలు కూడా జారీచేశారని తెలిపారు. డీజీపీ రాసిన లేఖ ప్రతిని మేజిస్ట్రేట్‌కు అందజేశారు. రేవంత్ (Revanth reddy) పాదయాత్రకు భద్రత కల్పిస్తే ఈ రోజు ఎందుకు విచారణకు పిటిషన్ వచ్చిందని లాయర్‌ను ప్రశ్నించారు. రేవంత్ పాదయాత్రకు ప్రభుత్వం కల్పించే భద్రత గురించి సోమవారం రోజున తెలియజేయాలని రేవంత్ తరఫు లాయర్‌కు మేజిస్ట్రేట్ సూచించారు. కేసు తదుపరి విచారణను ఈ నెల 6వ తేదీ (సోమవారానికి) వాయిదా వేసింది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై (Revanth reddy) ఇటీవల వరంగల్ జిల్లా భూపాలపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తలు టమాటాలు, గుడ్లు విసిరారు. బహిరంగ సభలో రేవంత్ రెడ్డి (Revanth reddy) మాట్లాడుతుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రేవంత్ రెడ్డి (Revanth reddy) వైపు దూసుకొచ్చి.. రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను దగ్గరలో గల థియేటర్ లో బంధించారు. కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్న థియేటర్‌పై రాళ్లు రువ్వారు. దీంతో థియేటర్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఉద్రిక్తతల మధ్య రేవంత్ రెడ్డి (Revanth reddy)ప్రసంగం ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
భూపాలపల్లిలో రేవంత్ రెడ్డి (Revanth reddy) పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇటీవల మంత్రి కేటీఆర్ (ktr) పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) ఫ్లెక్సీలు కడుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కేటీఆర్ పర్యటన ముగిసినా ప్లెక్సీలు ఎందుకని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రేవంత్ రెడ్డి కటౌట్ కట్టకుండా అడ్డుకోవడంతో అంబేద్కర్ కూడలిలో కాంగ్రెస్ కార్యకర్త టవర్ ఎక్కాడు. దీంతో గొడవ మరింత ముదిరి.. దాడులు చేసుకునే వరకూ వెళ్లింది.