SRPT: హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని ఈరోజు జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ సందర్శించారు. ఈ సందర్భంగా మండల ఎన్నికల ఏర్పాట్ల గురించి ఎన్నికల అధికారిని అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో మాట్లాడుతూ.. ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలని, ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటించాలని సూచించారు.