WGL: ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్లో బోర్డు ఆదేశాలను తప్పక పాటించాలని డీఐఈవో శ్రీధర్ సుమన్ అన్నారు. ఆయన మంగళవారం పర్వతగిరి, నెక్కొండ కళాశాలలను సందర్శించి అడ్మిషన్ల ప్రక్రియ, తరగతులు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి, మానసిక వికాసానికి కృషి చేయాలని అధ్యాపకులకు సూచించారు.