NLG: చిట్యాల కనకదుర్గ అమ్మవారి రథోత్సవాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బుధవారం గుమ్మడికాయ కొట్టి ప్రారంభించారు. ముందుగా ఆలయ ఛైర్మెన్ మారగోని ఆంజనేయులు గౌడ్, డైరెక్టర్లు ఆయనకు స్వాగతం పలికారు. ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దయతో పట్టణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు.