కరీంనగర్: కేంద్రమంత్రి అమిత్ షాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే సత్యం ఆధ్వర్యంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అవమానించడం దారుణమని మండిపడ్డారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.