కోనసీమ: జిల్లాలో కోనసీమ కొబ్బరికాయ ధరలు ఒక్కసారిగా రూ. 26 నుండి రూ. 15కి పడిపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే, ప్రస్తుతం ధర స్వల్పంగా పెరిగి రూ. 16 నుండి రూ. 17కు చేరుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పండగ సమయంలో కొనుబడులు పెరిగితే ధర మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు ఆదివారం ఆశాభావం వ్యక్తం చేశారు.