ఖమ్మం: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఎం రేవంత్ రెడ్డిపై జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాత మధు పార్టీ నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు. తెలంగాణ తొలి సీఎం అయినా కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు సరికాదని జిల్లా అధ్యక్షుడు అన్నారు. సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.