అందమైన నగిషీలు, మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలు, ఫౌంటైన్లు, గార్డెన్లు, సహజసిద్ధమైన వెలుతురు.. విశాలమైన కార్యాలయాలు, గదులు, హెలీప్యాడ్ ఇవన్నీ తెలంగాణ సచివాలయంలో కనిపిస్తున్న దృశ్యాలు. ఒక స్టార్ హోటల్ ను తలదన్నేట్టుగా తెలంగాణ సచివాలయం నిర్మితమైంది. హుస్సేన్ సాగర్ ఒడ్డున నిర్మితమవుతున్న ఈ సచివాలయం అందరినీ అబ్బురపరుస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చరిత్రాత్మక భవనాన్ని నిర్మిస్తున్నారు.
150 ఏళ్లు నిలిచేలా, ప్రకంపనలు తట్టుకునేలా డిజైన్ చేసింది నిర్మాణ సంస్థ. నీలకంఠేశ్వరాలయం, వనపర్తి ప్యాలెస్, సారంగాపూర్ హనుమాన్ (Hanuman Temple) ఆలయం స్ఫూర్తిగా నిర్మాణం సాగుతోంది. వాస్తుపరంగా అన్నింటిని పక్కాగా ప్లాన్ చేసి ఈ సౌధం నిర్మిస్తున్నారు. ఈ కట్టడంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దాదాపు పది సార్లయినా ఈ భవన నిర్మాణ పనులను స్వయంగా వచ్చి పరిశీలించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి దగ్గరుండి మరి జాగ్రత్తలు, సూచనలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం హైదరాబాద్ గడ్డపై తెలంగాణ పౌరుషం.. ఆత్మగౌరవం తలకెత్తున్నట్టు ఈ నిర్మాణం ఉందని తెలంగాణ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం 26.98 ఎకరాల్లో నిర్మాణమవుతున్న ఈ సుందర సౌధానికి ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం’ అని నామకరణం చేశారు. 11 అంతస్తుల్లో ఈ భవనం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు ఆరు అంతస్తుల్లో సచివాలయ ప్రధాన భవనం ఉంది. మధ్యలో భవనంపైన ఐదంతస్తుల మేర భారీ గుమ్మటాలతో కూడిన సెంట్రల్ టవర్స్ ఉంటాయి. లోపల మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కు తలదన్నేలా ఈ నిర్మాణం ఉంది. నిర్మాణం లోపల మరింత అందంగా.. సుందరంగా నిర్మాణాలు ఉన్నాయి. ఈ భవనానికి సంబంధించిన డ్రోన్ వీడియో ప్రజలను మరింత ఆకర్షిస్తోంది. ఈ మొత్తం నిర్మాణానికి దాదాపు రూ.1,350 కోట్లు ఖర్చు అవుతున్నట్లు సమాచారం.
ఫిబ్రవరి 17వ తేదీన సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం నిర్ణయించారు. అట్టహాసంగా జరిగే ఈ ప్రారంభోత్సవానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, బీఆర్ అంబేడ్కర్ మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్ తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు తరలిరానున్నారు. ముగ్గురు ముఖ్యమంత్రుల చేత ఈ సుందర సౌధం ప్రారంభం కానుంది.
150 ఏళ్లు నిలిచేలా, ప్రకంపనలు తట్టుకునేలా డిజైన్ చేసింది నిర్మాణ సంస్థ. నీలకంఠేశ్వరాలయం, వనపర్తి ప్యాలెస్, సారంగాపూర్ హనుమాన్ (Hanuman Temple) ఆలయం స్ఫూర్తిగా నిర్మాణం సాగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. సచివాలయం మయసభను తలపించేలా ఉందని చెప్పుకోవచ్చు.#TelanganaSecretariatpic.twitter.com/kJ5xXpTYtw