KMR: పాల్వంచలోని ఫరీద్పేటలో మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని మహిళా సంఘాల నాయకులు సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డిని కోరారు. ప్రస్తుతం మూడు గ్రామ సంఘాలకు ఒకే మహిళా భవనం ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. మరో రెండు గ్రామ సంఘాలకు భవనాల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు 200 గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలన్నారు.