NLG: నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోను మరియు చుట్టుపక్కల గ్రామాల్లో అపర్నిశలు కష్టపడి చెమటోడ్చి వ్యవసాయం కోసం కొనుగోలు చేసిన పది లక్షల విలువ చేసే వ్యవసాయ మోటర్లు,పైపులను చోరీకి గురయ్యాయి. నిందితుడైన మాగి నాగరాజు పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివారం అన్నదాతలు వేడుకుంటున్నారు. నల్లగొండ జిల్లాలో వందల మంది అన్నదాతలు నష్టపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.