Discussions between Congress and BRS leaders with Tula Uma
Tula Uma: వేములవాడ బీజేపీ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకుంది. దీంతో తుల ఉమ (Tula Uma) కన్నీటి పర్యంతం అయ్యారు. బీసీ నేతపై ఇలా ప్రవర్తిస్తారా.. తనకు ఫోన్ చేయొద్దని మండిపడ్డారు. ఉమ (Uma) బీజేపీతో గుర్రుమీద ఉంది. ఆమెను తమ పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ అనుకుంటున్నాయి. వరసగా సంప్రదింపులు జరుపుతున్నాయి.
తుల ఉమ.. ఈటల రాజేందర్ ప్రధాన అనుచరురాలు.. అందుకే టికెట్ ఇచ్చారు. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావు.. తనకు టికెట్ కావాలని పట్టుబట్టాడు. ఇంకేముంది హైకమాండ్ పెద్దల అండతో దక్కించుకున్నాడు. తుల ఉమ పార్టీలో ఒంటరి అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్, ఇతర నేతలు సంప్రదింపులు జరిపారు. తమకు అండగా నిలవాలని.. పార్టీలో చేరాలని కోరినట్టు తెలుస్తోంది.
మరోవైపు తుల ఉమతో వినోద్ కుమార్ కూడా చర్చలు జరిపారని తెలిసింది. ఆమెతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాట్లాడారని తెలిసింది. చర్చలు జరిపేందుకు తుల ఉమ ఇంటికి చల్మెడ లక్ష్మీనరంహా రావు వచ్చారని తెలిసింది. సంప్రదింపులు ఓకే అయ్యాయని.. పార్టీలో చేరేందుకు అంగీకరించారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది.
తుల ఉమతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చర్చలు జరిపాయి. ఆమె ఏ పార్టీలో చేరే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఎప్పుడూ ఇస్తుందో చూడాలి మరీ.