SRD: రాజీతో పెండింగ్ కేసులు లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి మంగళవారం తెలిపారు. సెప్టెంబర్ 13న ఖేడ్‌లోని జూనియర్ సివిల్ కోర్టులో లోక్ అదాలత్ కార్యక్రమం ఉందని చెప్పారు. ఇందులో యాక్సిడెంట్, కొట్లాట, చీటింగ్, చిట్‌ఫండ్, భూతగాద, దొంగతనం, అక్రమ రవాణా, పేకాట పెండింగ్ కేసులను ఈనెల 28 నుంచి సెప్టెంబర్13 వరకు రాజీ చేసుకోవచ్చన్నారు.