HNK: ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవడమే మనందరి లక్ష్యంగా మార్చుకోవాలని సీపీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా శుక్రవారం నిర్వహించిన బైక్ ర్యాలీలో CP పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.