వనపర్తి జిల్లా కేంద్రంలో ఈనెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహించిన అండర్ 14 బాలుర రాష్ట్ర స్థాయి హాకి క్రీడా పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి జాతీయ స్థాయికి ఎంపికైన వనపర్తి జట్టు క్రీడాకారులను గురువారం వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో మొదటి స్థానంలో నిల్వాలని ఆయన ఆకాంక్షించారు.