నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత 2023 కంటే ఈ 2024 సంవత్సరంలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయని జిల్లా ఇంఛార్జ్ సీపీ సింధూ శర్మ తెలిపారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఘోర ప్రమాదాలు 3.20 శాతం, ప్రమాదాలు 12 శాతం పెరిగాయన్నారు. 2024 సంవత్సరంలో నేటి వరకు 322 రోడ్డు ప్రమాదాల్లో 335 మంది మృతి చెందారన్నారు. అలాగే 509 ప్రమాదాల్లో 758 మంది గాయపడ్డారని పేర్కొన్నారు.