ASF: బెజ్జూర్ మండల కేంద్రంలోని శివాలయంలో శ్రావణమాస మాస శివరాత్రి సందర్భంగా శివలింగానికి అన్న ప్రసాదంతో అలంకరణ, అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు గురుదత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కనుకుట్ల వెంకటేష్ దంపతులు, మద్దెర్ల వెంకన్న దంపతులు, శ్రీరామ భాస్కర్ దంపతులు పాల్గొన్నారు.