KMM: ఇంటింటి సమగ్ర సర్వేలో, ఎలాంటి తప్పులు లేకుండా వివరాలు నమోదు చేయాలని కల్లూరు ఆర్డీవో రాజేందర్ తెలిపారు. కల్లూరులోని అంబేద్కర్‌నగర్‌లో జరుగుతున్న ఇంటింటి సమగ్ర సర్వేను ఆర్డిఓ పరిశీలించారు. విద్య, ఉపాధి, సామాజికవర్గం, రాజకీయ, కుటుంబ పరిస్థితి, తదితర అంశాలపై పూర్తిస్థాయిలో సమాచారం సేకరించాలని సర్వే సిబ్బందికి సూచించారు.