KNR: చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా మేడిపల్లి సత్యం బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది గడిచింది. ఆయన 2023 సార్వత్రిక ఎన్నికల్లో చొప్పదండి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. ప్రత్యర్థి బీఆర్ఎస్కు చెందిన సుంకె రవిశంకర్‌పై 37, 439 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.