NRML: పట్టణ వెంకటాద్రిపేట్ కాంగ్రెస్ ముఖ్య నాయకుడు అనుముల శ్రవణ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పట్టణంలో బీజేపీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.