KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద రావడంతో అధికారులు 4 రోజుల కిందట గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. జలాశయంలోకి ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టడంతో గేట్లను దింపుతుండగా 10వ నంబర్ గేటు మొరాయించింది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. శుక్రవారం జేసీబీ సాయంతో గేటును కిందికి దింపినట్లు అధికారులు చెప్పారు.