ఖమ్మం జిల్లా మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం వారి కార్యాలయంలో ఆర్ అండ్ బి అధికారులతో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖమ్మం నుండి విజయవాడ వరకు నాగులవంచ, బోనకల్ మీదుగా నాలుగు లైన్ల రోడ్డు వేసేందుకు తగు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు.