Telangana బీజేపీ మేనిఫెస్టో రెడీ..12 లేదా 13న రిలీజ్ !
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో బీజేపీ స్పీడ్ పెంచింది. కీలక నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు.. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ(Telangana)లో ఎన్నికల సమీస్తున్న వేళ మేనిఫెస్టోపై బీజేపీ కసరత్తు చేస్తోంది ఇప్పటికే బీఆర్ఎస్,కాంగ్రెస్ తమ హామీలను ప్రకటించగా..వాటికి దీటుగా బీజేపీ (BJP) మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు సమాచారం. మరోవైపు రాష్ట్రంలోని నగరాల పేర్లను కూడా మారుస్తామని హామి అందులో ఉంది. ఇందులో భాగంగా హైదరాబాద్ (Hyderabad) పేరును భాగ్యనగర్‌గా, నిజామాబాద్ పేరును ఇందూర్‌గా, వికారాబాద్‌ను గంగవరంగా, కరీంనగర్‌ను కరీనగర్గా, మహబూబ్‌నగర్‌ను పాలమూరుగా, ఆదిలాబాద్‌ను ఏదులాపురంగా, మహబూబాబాద్‌ను మానుకోటగా పేర్లు మారుస్తూ మేనిఫెస్టో(Manifesto)లో చేర్చినట్టు సమాచారం.
బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో నవంబర్ 12 లేదా 13వ తేదన విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు.. నేడు బీజేపీ అభ్యర్థులకు సంబంధించి నాలుగో జాబితా విడుదల కానుంది. 23 మంది అభ్యర్థులతో తుది జాబితాలను బీజేపీ విడుదల చేసే అవకాశం ఉంది. బీజేపీ-జనసేన పొత్తులో భాగంగా ఎనిమిది సీట్లను జనసేనకు వదిలేయనున్నారు. ఇక, జనసేన(Janasena)కు వదిలేసిన స్థానాల్లో బీజేపీ కేడర్ నుంచి వ్యతిరేకతవ్యక్తమవుతోంది. శేరిలింగంపల్లి సీటుపై కూడా ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే, పొత్తు (Alliance) కుదిరినప్పటికీ జనసేనతో పనిచేయలేమని బీజేపీ కేడర్ సీరియస్‌గా చెబుతున్నారు.