WGL: తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కార్యదర్శిగా ఆడెపు చంద్రయ్య రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ చేతుల మీదుగా నేడు నియామకపత్రాన్ని అందజేశారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు. వారు మాట్లాడుతూ.. చేనేత పరిశ్రమ పరిరక్షణ కోసం తనవంతు కృషిచేస్తానన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఐక్యవేదిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.