NZB: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నెలకొల్పిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో నైపుణ్యంతో కూడిన శిక్షణ పొందడం ద్వారా యువతకు విరివిగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. జిల్లాలోని శివాజీనగర్‌లో గల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ) ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 2 సెంటర్లను కలెక్టర్‌తో సునయన ప్రారంభించారు.