MDK: మున్సిపాలిటీ ఎన్నికల ముసాయిదా ఓటర్ జాబితా విడుదలైంది. దీని ప్రకారం ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని 19 మున్సిపాలిటీల్లో మొత్తం 5,43,103 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో మహిళా ఓటర్లు 2,73,219 మంది కాగా, పురుష ఓటర్లు 2,69,432 మంది ఉన్నారు. ఎన్నికలు జరగనున్న అన్ని మున్సిపాలిటీల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లు 3787 మంది ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు.