CTR: రూ. 50 లక్షల విలువ చేసే 210 గ్రాముల బంగారు, ఆభరణాలు, కారు, బైక్ను అంతర్రాష్ట్ర దొంగల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు చిత్తూరు పోలీసులు బుధవారం తెలిపారు. పలమనేరులో బాలాజీ ఇంట్లో జరిగిన చోరీపై విచారణ జరిపి నిందితులను గుర్తించామన్నారు. వెంకటయ్య, నాగుల్ మీరా, తులసిరామిరెడ్డి పలు ప్రాంతాలలో చోరీలకు పాల్పడ్డారని, వారిని అరెస్టు చేశామని చెప్పారు.