NZB: మనం ఊరుకుంటే ప్రభుత్వం కదలదు.. ప్రతీ ఒక్కరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఆదివారం ఆమె నిజామాబాద్ సభలో మాట్లాడుతూ.. గ్రామ గ్రామాన కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని సూచించారు. కాగా విద్యార్థులు, రైతులు, మహిళలను, ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని దుయ్యబట్టారు.