WGL: చెన్నారావుపేట మండలంలోని ఖాదర్ పేటలో ఆదివారం ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే తీరును క్షేత్ర స్థాయిలో కలెక్టర్ డాక్టర్ సత్య శారదా పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా వివరాలను పొందుపరచాలని ఆదేశించారు. నియమించిన ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ సర్వేలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ అన్నారు.