BDK: ప్రజా పాలన విజయోత్సవ సంబరాల్లో భాగంగా మంగళవారం అశ్వాపురం మండలంలో కేంద్రంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే పాయం, రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, దేశానికి అన్నం పెట్టే రైతన్న సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే తెలిపారు.