»Anand Mahindra Dance With Ram Charan For Naatu Naatu Song
Anand Mahindra : రామ్ చరణ్‌తో కలిసి నాటు నాటు పాటకు ఆనంద్ మహీంద్రా డ్యాన్స్.. వీడియో
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. ఆ పాట ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. చివరకు అది ఆస్కార్ నామినేషన్స్ వరకు వెళ్లింది అంటే.. ఆ పాటకు ఉన్న రేంజ్ ఏంటో తెలిసిపోతోంది. ఆ పాటకు డ్యాన్స్ వేయని వారు లేరు
Anand Mahindra: ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. ఆ పాట ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. చివరకు అది ఆస్కార్ నామినేషన్స్ వరకు వెళ్లింది అంటే.. ఆ పాటకు ఉన్న రేంజ్ ఏంటో తెలిసిపోతోంది. ఆ పాటకు డ్యాన్స్ వేయని వారు లేరు. ప్రతి ఒక్కరు ఆ పాట వింటే స్టెప్స్ వేయాల్సిందే. అంతలా ఊపేస్తుంది ఆ పాట.
తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా, ఆర్ఆర్ఆర్ హీరో రామ్ చరణ్ ఇద్దరూ కలిసి నాటు నాటు పాటకు డ్యాన్స్ వేశారు. ఫార్ములా ఈ రేసింగ్ కోసం ఆనంద్ మహీంద్రా హైదరాబాద్ కు వచ్చారు. ఈసందర్భంగా రామ్ చరణ్ ను కలిశారు. ఇద్దరూ కలిసి నాటు నాటు పాటకు కాసేపు డ్యాన్స్ వేసి అక్కడున్న వారిని అలరించారు. రామ్ చరణ్ దగ్గర నాటు నాటు స్టెప్స్ కొన్ని నేర్చుకున్నా. రేస్ చూడటానికి హైదరాబాద్ వచ్చా కానీ.. రియల్ బోనస్ అంటే.. రామ్ చరణ్ నుంచి నాటు నాటు పాట డ్యాన్స్ స్టెప్పులను నేర్చుకోవడం అంటూ ఆనంద్ మహీంద్రా ఆ వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేశారు.
Anand Mahindra: వావ్.. సూపర్బ్ అంటున్న నెటిజన్లు
ఆ వీడియోను చూసిన నెటిజన్లు దాన్ని నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు. వావ్.. సూపర్ సార్. సూపర్బ్ డ్యాన్స్. మీ ఫిట్ నెస్ కు హేట్సాఫ్ అంటూ నెటిజన్లు ఆ వీడియోను మరింత వైరల్ చేస్తున్నారు. మీరు ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్ చేశారు.