BDK: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ సంబురాలు నేటి నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుపనున్నట్టు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న తెలిపారు. చుంచుపల్లి మండలం విద్యానగర్ లోని రెవిన్యూ మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.