ADB: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన సర్వేకు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ అసెంబ్లీ ఇంచార్జ్ ఆడే గజేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించేందుకు దోహదపడుతుందన్నారు. అపోహలు వీడి సర్వేకు సహకరించాలని కోరారు.