KMR: ఉగాది పండుగను కామారెడ్డి జిల్లాలో రైతన్నలు ప్రత్యేకంగా చేసుకుంటారు. ఉగాది తెలుగు నూతన సంవత్సరం కావడంతో రైతులు కొత్త పనులు ప్రారంభిస్తారు. ఉగాది రోజు వేకువజామునే పంట పొలానికి ఎరువును, పసుపు కుంకుమ, టెంకాయతో పాటు పూజ సామగ్రి తీసుకుని వెళ్తారు. పంట భూమిలో తూర్పు దిక్కున ఎరువును ఐదు కుప్పలుగా ఉంచి పూజలు చేస్తారు.