BDK: పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ను ముదిరాజ్ సంఘం నాయకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మణుగూరు రామానుజవరం గ్రామంలో 200 కు పైగా కుటుంబాలు ముదిరాజ్ కుటుంబాలు ఉన్నాయని వారికి ముదిరాజ్ భవన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు.