VKB: జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా సయ్యద్ మల్కాపూర్ గ్రామంలో పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నాగేందర్ మాట్లాడుతూ.. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం పాటించి ప్రమాదాలను నివారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.