SRCL: అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా వృక్షాలను నేల మట్టం చేస్తూ యథేచ్చగా అక్రమంగా కలపను తరలిస్తున్నా అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. మండలంలోని వివిధ గ్రామాల్లో నుంచి నిత్యం ట్రాక్టర్లలో అక్రమార్కులు కలపను యథేచ్ఛగా తరలిస్తున్నారు. చెట్టును నరకాలంటే ప్రభుత్వ అధికారుల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుందని తెలిపారు.