KMR: కామారెడ్డి జిల్లా దోమకొండలో హార్వెస్ట్ మినిస్ట్రీస్, ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్ సందర్శించారు. ఉచిత వైద్య శిబిరాన్ని 530 మంది వినియోగించుకోవడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వహకులు డాక్టర్ కాలేజ్ రాయపాటి, రత్నాకర్ అంచనూర్, శ్రీనివాస్ సాప, రవి, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.