NRML: నిర్మల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో పదవ తరగతి విద్యార్థులకు బుధవారం నిర్వహించిన గణిత ప్రతిభ పోటీలు ముగిసాయి. ఆయా మండలాల నుండి వచ్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీలలో పాల్గొని నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ సిద్ధపద్మ మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకే గణిత పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.