SRPT: జిల్లాలో పోలీస్ శాఖ 2025లో స్నేహపూర్వక పోలీస్ విధానాన్ని అవలంబిస్తూ, బాధ్యతాయుతంగా పని చేసి శాంతి, భద్రతలను కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ కె. నర్సింహ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వార్షిక నివేదికను ఆవిష్కరించి, సమగ్ర వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రజల భద్రత, న్యాయసమర్థత కోసం పోలీస్ శాఖ సదా కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.