NZB: SC, ST ఉపాధ్యాయ సంఘం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నేడు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపనున్నట్లు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమేష్, మల్లికార్జున్ తెలిపారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో గల తుక్కుగూడ ZPHS పాఠశాల HM రాములుకు జరిగిన అవమానానికి నిరసనగా మధ్యాహ్నం భోజన సమయంలో ధరించి నిరసన వ్యక్తం చేస్తామని అన్నారు.