MBNR: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో భాగంగా జిల్లా వ్యాప్తంగా చేపట్టిన తనిఖీలు, నిఘా చర్యల్లో రూ.11,08,250 నగదును సీజ్ చేసినట్లు జిల్లా ఎస్పీ డి. జానకి గురువారం తెలిపారు. అలాగే రూ.6,93,858 విలువైన మద్యం కేసులకు సంబంధించి 81 ఎక్సైజ్ కేసులు నమోదు చేసి, 1050.23 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.