GDWL: గద్వాల జిల్లా పరిధిలోని జమ్మిచేడులో వెలిసిన జమ్ములమ్మకు ఆదివారం కార్తీక మాసం, అమావాస్య సందర్భంగా ప్రత్యేక అలంకరణ చేసి, విశేష పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు కృష్ణా నది జలాలతో అమ్మవారిని అభిషేకించి, అర్చన, ఆకు పూజ, హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.